తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండోనేషియా ఓపెన్​లో సింధు ముందుకు.. శ్రీకాంత్​ ఇంటికి - pv sindhu

ఇండోనేషియా ఓపెన్​లో భారత స్టార్ షట్లర్ సింధు క్వార్టర్స్​కు ప్రవేశించింది. పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్ పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

మ్యాచ్

By

Published : Jul 19, 2019, 10:07 AM IST

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ మియా బ్లిచ్‌ఫెల్ట్​పై 21-14, 17-21, 21-11 తేడాతో విజయం సాధించింది. 62 నిమిషాల పాటు మ్యాచ్‌ సాగింది.

మొదటి గేమ్ గెలిచిన సింధు.. రెండో సెట్​లో తడబడింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ విజయం దక్కించుకుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకిది మూడో విజయం. ఇంతకుముందు ఇండియన్‌ ఓపెన్, సింగపూర్‌ ఓపెన్‌లలో ఆమెను ఓడించింది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో

మూడో సీడ్‌ నొజోమి ఒకుహారా(జపాన్‌)తో సింధు తలపడనుంది. వీరిద్దరూ 14 సార్లు తలపడగా.. చెరో ఏడు విజయాలను పంచుకున్నారు.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో 8వ సీడ్ శ్రీకాంత్‌కు పరాజయం ఎదురైంది. హాంకాంగ్‌కు చెందిన లాంగ్ అంగూస్ చేతిలో 17-21, 19-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి 15-21, 14-21తో ఇండోనేషియా టాప్‌ సీడ్‌ జోడి మార్కస్‌ గిడియోన్‌-కెవిన్‌ సంజయ చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సిక్కి రెడ్డి-ప్రణవ్‌ చోప్రా 14-21, 11-21తో టాప్‌ సీడ్‌ జెంగ్‌ సి వె-హువాంగ్‌ యా కియోంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయారు.

ఇవీ చూడండి.. ఇండోనేసియా ఓపెన్​లో భారత షట్లర్ల శుభారంభం

ABOUT THE AUTHOR

...view details