భారత షట్లర్ పీవీ సింధు మళ్లీ నిరాశ పరిచింది. ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో జపాన్‌కు చెందిన యమగూచిపై ఓడిపోయింది. టైటిల్ పోరులో వరుస సెట్లలో పరాజయం పొంది రన్నరప్‌గా నిలిచింది.
ఇండోనేసియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్-1000 టోర్నమెంట్లో 15-21, 16-21 తేడాతో ఓటమి చవిచూసింది సింధు. ఈ ఇద్దరు ముఖాముఖి 14సార్లు తలపడగా పది సార్లు సింధునే గెలిచింది. కానీ ఈ సారి యమగూచిపై పట్టుసాధించలేకపోయింది.