తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనా ఓపెన్​లో పీవీ సింధు ఇంటిముఖం - sindhu

చైనా ఓపెన్​లో పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్​లో థాయ్​లాండ్​కు చెందిన చోచూవాంగ్ చేతిలో పరాజయం చెందింది.

సింధు

By

Published : Sep 19, 2019, 3:48 PM IST

Updated : Oct 1, 2019, 5:19 AM IST

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణంతో సత్తాచాటిన భారత షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్​ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్​లో థాయ్​లాండ్​కు చెందిన చోచూవాంగ్ చేతిలో పరాజయం చెందింది.

21-12, 13-21, 19-21 తేడాతో ఓడింది. 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో ప్రత్యర్థి పైచేయి సాధించింది. తొలి సెట్లో సులభంగా నెగ్గింది సింధు. అయితే అనంతరం పుంజుకున్న థాయ్​లాండ్ ప్లేయర్ వరుస సెట్లలో తెలుగమ్మాయిని ఓడించింది.

హోరాహోరీగా సాగిన చివరి సెట్లో సింధు పోరాడినప్పటికీ ప్రత్యర్థినే విజయం వరించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్​లో చైనాకు చెందిన లీ యూరేపై 21-18, 21-12 తేడాతో గెలిచింది సింధు.

ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్​షిప్​లో 'సాక్షి'కి నిరాశ

Last Updated : Oct 1, 2019, 5:19 AM IST

ABOUT THE AUTHOR

...view details