భారత యువ షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం(ఆగస్టు 29) అర్జున అవార్డును వర్చువల్‌గా అందుకోనున్నాడు ఈ క్రీడాకారుడు.
అర్జున అవార్డుకు ఎంపికైన షట్లర్‌కు కరోనా - షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌కు కరోనా
అర్జున పురస్కారానికి ఎంపికైన యువ షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. తనకు లక్షణాలు ఏం లేవని చెప్పాడు.
తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నెగటివ్ వచ్చిందని, తనకు మాత్రం వైరస్ ఎలా సోకిందో తెలియట్లేదని సాత్విక్ అన్నాడు. లక్షణాలు ఏం కనిపించట్లేదని తెలిపాడు. అమలాపురంలోని తన ఇంట్లో వారం పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు.
2018 కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకం, థాయ్‌లాండ్ ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకున్నారు సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ. ఫలితంగా వీరిద్దరూ అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారం దక్కడం రానున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో స్ఫూర్తి కలిగిస్తుందని సాయిరాజ్ చెప్పాడు.