తెలంగాణ

telangana

ETV Bharat / sports

'శిక్షణ శిబిరంలో నా స్థానం ఎక్కడ?' - badminton latest sports news

బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరంలో తనను చేర్చుకోకపోవడంపై షట్లర్ కశ్యప్ సాయ్​పై అసహనం వ్యక్తం చేశాడు. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశాలు తనకూ ఉన్నాయని పేర్కొన్నాడు.

Parupalli Kashyap
పారుపల్లి కశ్యప్

By

Published : Aug 26, 2020, 7:20 AM IST

జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరంలో తనకు చోటు కల్పించకపోవడంపై పారుపల్లి కశ్యప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు తనకూ ఉన్నాయని అన్నాడు. హైదరాబాద్​లోని సాయి-గోపీచంద్​ అకాడమీలో 8 మందిని శిక్షణకు అనుమతించారు. అయితే, ఇది అశాస్త్రీయంగా అనిపిస్తోందని కశ్యప్​ పేర్కొన్నాడు.

"ఈ ఎనిమిది మందే ఒలింపిక్‌ ఆశావహులు ఎలా అయ్యారు? వీరిలో ముగ్గురికి మాత్రమే ఒలింపిక్‌ బెర్తులు దాదాపు ఖాయమయ్యాయి. శ్రీకాంత్‌, మహిళల డబుల్స్‌ జోడీతో సహా మిగతా వారందరికీ ఒలింపిక్స్‌ అవకాశం కష్టంగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాది 23వ స్థానం. సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌ల తర్వాత అత్యుత్తమ ర్యాంకు నాదే. అయినా శిక్షణ శిబిరానికి నన్ను పరిగణలోకి తీసుకోలేదు. జాబితా తయారు చేసిన సాయ్‌ అధికారులతో మాట్లాడాలని గోపీ అన్న సలహా ఇచ్చాడు. జాబితా రూపకల్పనకు అనుసరించిన విధివిధానాలేంటని సాయ్‌ డీజీని అడిగా. మరుసటి రోజు సాయ్‌ సహాయక డైరెక్టర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. సాయ్‌తో, భారత బ్యాడ్మింటన్‌ సంఘంతో ఉన్నతాధికారులు మాట్లాడారని.. ఈ ఎనిమిది మందికి మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశముందంటూ వారు చెప్పినట్లు తెలిపాడు. నాకు వింతగా అనిపించింది"

-పారుపల్లి కశ్యప్‌, బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు

"క్రీడాకారులు భద్రత దృష్ట్యా ఒలింపిక్స్‌ వరకు ఎనిమిది మందే ప్రాక్టీస్‌ చేస్తారన్నారు. ప్రస్తుతం ఎవరూ అకాడమీలో ఉండట్లేదు. బయట వేరేవాళ్లను కలుస్తున్నారు. క్రీడాకారుల భద్రతపై వారి వివరణ నాకు అర్థం కావడం లేదు. శిక్షణ శిబిరంలో తొమ్మిది కోర్టులు ఉన్నా.. నలుగురే సాధన చేస్తున్నారు. నాలాగే అర్హత సాధించేందుకు తక్కువ అవకాశమున్న లక్ష్యసేన్‌ బెంగళూరులో అందరితో కలిసి సాధన చేస్తున్నాడు. మిగతా వారితో ప్రాక్టీసు చేసే అవకాశమే లేకపోతే ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధిస్తాను?" అని కశ్యప్‌ ప్రశ్నించాడు.

ABOUT THE AUTHOR

...view details