Kidambi Srikanth Paris Olympics: తన అంతిమ లక్ష్యం పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం సాధించడమేనని తెలిపాడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్. ప్రస్తుత ఛాంపియన్‌షిప్‌లో దక్కిన విజయాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇంకా తన కెరీర్ గురించి పలు విషయాలను చెప్పాడు. ఆ సంగతులు మీకోసం..
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారత పురుష ప్లేయర్ మీరు. ఇంకా ఆ ఆనందంలోనే ఉన్నారా?
శ్రీకాంత్: అవును. ప్రస్తుతం దేని గురించి ఆలోచించట్లేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను.
సెమీఫైనల్లో మరో భారత ఆటగాడు లక్ష్యసేన్‌తో తలపడటం ఎలా అనిపించింది? మ్యాచ్ తర్వాత మీ సంభాషణ ఎలా సాగింది?
శ్రీకాంత్:మన దేశం తరఫున ఆడేవాళ్లతో తలపడటం ఎప్పుడూ కష్టమైనదే. ఇద్దరం గెలవడానికే ఆడతాం. మ్యాచ్‌లో నేను గెలవడం ఆనందంగా ఉంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మాములుగానే మాట్లాడుకున్నాం. టోర్నీ, పోటీ గురించి ఏమీ మాట్లాడుకోలేదు.
ఫైనల్లో కీన్ యూ చేతిలో ఓడిపోవడంపై బాధగా ఉందా?
శ్రీకాంత్:అలా ఏమీ లేదు. ఫైనల్లో అతడితో నేను ఆడిన విధానంపై ఆనందంగానే ఉంది. కాకపోతే ఇంకాస్త బెటర్‌గా ఆడాల్సింది. ఏదేమైనప్పటికీ మన తప్పుల్ని తెలుసుకుని మరింత ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నించాలి.
ఈ ఛాంపియన్‌షిప్‌కు ముందు సుదిర్మన్ కప్, థామస్, ఉబర్ కప్ సహా పలు టోర్నీలు ఆడారు. మీరు ఉత్తమంగా ఆడుతున్నారని ఎప్పుడు గ్రహించారు?
శ్రీకాంత్:ప్రతి టోర్నీకి మెరుగుపడుతూనే ఉన్నాను. జర్మన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఆడేటప్పుడు నా ఆటలో డిఫరెన్స్‌ను గమనిస్తాను. ఇండోనేషియాలో ఆడేటప్పుడు మరింతగా గమనిస్తాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేటప్పుడు మెడల్ సాధించాలని ఉన్నప్పటికీ దాని గురించి ఆలోచించను. ఉత్తమంగా ఆడటంపైనే దృష్టి పెడతాను. బాగా ఆడితే తప్పకుండా పతకం సాధిస్తాం.
2017లో మీరు సాధించిన ఘనతలకన్నా ఇది ఎక్కువ అని భావిస్తున్నారా?
శ్రీకాంత్:అవును.