తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్​ ఓపెన్ ఫైనల్​కు సిక్కి-అశ్విని జోడి - సిక్కి రెడ్డి -అశ్విని పొన్నప్ప

హైదరాబాద్​ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరభ్​ వర్మ.. మహిళా డబుల్స్​లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడి ఫైనల్​కు చేరుకున్నారు.

హైదరాబాద్​ ఓపెన్ ఫైనల్​కు సిక్కి-అశ్విని జోడి

By

Published : Aug 10, 2019, 8:08 PM IST

జాతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సౌరభ్ వర్మ.. హైదరాబాద్​ ఓపెన్​ ఫైనల్​లో ప్రవేశించాడు. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మలేషియాకు చెందిన జుల్కరనైన్​పై 23-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఈ గేమ్ 48 నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం జరిగే తుదిపోరులో లోకియన్(సింగపూర్)-హీయో క్వాంగ్ హీ(కొరియా) మ్యాచ్​ గెలిచిన వారితో తలపడనున్నాడు సౌరభ్.

ఇదే టోర్నీలో మహిళా విభాగంలో భారత్​కు చెందిన టాప్​ సీడ్ డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి..​ హాంకాంగ్​కు చెందిన ఫాన్ కా యాన్- వూయి టింగ్​ జంటను 21-12, 21-12 పాయింట్ల తేడాతో ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లింది. టైటిల్​ కోసం కొరియాకు చెందిన బేక్ హనా-జుంగ్ క్యూంగ్ ఎన్​తో హోరాహోరీగా తలపడనుందీ జోడి.

ఇది చదవండి: ధోనీ రాకకై ఎదురు చూస్తున్న సర్​ఫ్రైజ్​

ABOUT THE AUTHOR

...view details