ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు విఫలమైన వేళ.. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో జపాన్ ద్వయం హిరోయికి ఎండో - యుతా వతనబెపై విజయం సాధించింది.
పారిస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 21-11. 25-23 తేడాతో వరుస సెట్లలో నెగ్గి ఫైనల్ చేరారు. తొలి గేమ్‌లో ఆధిపత్యం చెలాయించిన భారత్ జోడీ.. రెండో సెట్లో చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే చివరికి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.