తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: ఫైనల్స్​లో సాత్విక్-చిరాగ్​ ఓటమి - సాత్విక్-చిరాగ్ జోడి

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్​ ఫైనల్లో భారత ద్వయం సాత్విక్​-చిరాగ్​ ఓడి రన్నరప్​గా నిలిచారు. ఇండోనేసియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 జోడీ మార్కస్-కెవిన్ టైటిల్ గెలిచింది. ఇది వారికి ఏడో టైటిల్​ కావడం విశేషం.

ఫ్రెంచ్​ ఓపెన్​: ఫైనల్స్​లో ఓడిన సాత్విక్-చిరాగ్​ ద్వయం

By

Published : Oct 28, 2019, 5:18 AM IST

ఫ్రెంచ్ ఓపెన్​లో భారత షట్లర్ల ప్రస్థానం నిరాశతో ముగిసింది. పురుషుల డబుల్స్​ ఫైనల్లో భారత జోడీ సాత్విక్-చిరాగ్​ ఓడింది. ఇండోనేసియాకు చెందిన ప్రపంచ నెంబర్​ 1 జోడీ మార్కస్​ -కెవిన్​ టైటిల్​ ఎగరేసుకుపోయింది.

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 పురుషుల డబుల్స్​ ఫైనల్​ మ్యాచ్​ కేవలం 35 నిమిషాల్లో ముగిసింది. సాత్విక్​సాయిరాజ్​, రంకిరెడ్డి-చిరాగ్​ శెట్టి ద్వయం.. మార్కస్​ ఫెర్నాల్డి గిడియాన్​- కెవిన్​ సంజయ సుకముల్జో జోడి చేతిలో 18-21, 16-21 తేడాతో ఓడిపోయింది.

పోరాడారు..

సాత్విక్-చిరాగ్​ తొలి సెట్​​ ప్రారంభంలో బాగా వెనుకబడ్డారు. ప్రపంచ నంబర్ 1 జోడి వీరిపై 7-1 ఆధిక్యం సాధించింది. ఆ సమయంలో తెలివిగా, పట్టుదలతో ఆడిన భారత జోడీ.. స్కోర్​ను 17-17తో సమం చేసింది. అయితే మార్కెస్-కెవిన్​ జోడీ వెనువెంటనే 3 పాయింట్లు సాధించి తొలిసెట్​​​ కైవసం చేసుకుంది.

రెండో సెట్​లో భారత జోడీ.. ఇండోనేసియా ద్వయంతో 6-6, 10-10, 12-12 పాయింట్ల వరకు హోరాహోరీగా పోరాడారు. తరువాత ఒక్కసారిగా విజృంభించిన ప్రపంచ నెంబర్​ 1 సీడ్స్​ 18-13తో ముందుకు దూసుకుపోయారు. సాత్విక్-చిరాగ్ ఒత్తిడికి లోనవడాన్ని అవకాశంగా తీసుకున్న మార్కెస్- కెవిన్ ద్వయం చివరి 4 పాయింట్లు సాధించి గేమ్​ను ముగించింది. ఫలితంగా ఈ స్టార్ ద్వయం తమ ఖాతా​లో 7వ టైటిల్​ను చేర్చుకుంది.

ప్రశంసనీయం..

సాత్విక్-చిరాగ్ ద్వయం ఫైనల్లో ఓడినప్పటికీ వారి ఆటతీరు ప్రశంసనీయం. ఓ భారత పురుషుల జట్టు వరల్డ్ టూర్​ 750 ఫైనల్​కు చేరుకోవడం ఇదే మొదటిసారి.

ఈ భారత జోడీ.. ఫ్రెంచ్ ఓపెన్​ ఫైనల్​కు చేరే క్రమంలో.. ప్రపంచ ఛాంపియన్స్​ మొహమ్మద్​ ఆహ్సాన్​-హేండ్ర సెటివాన్​ జోడీని ఓడించింది. తరువాత ప్రపంచ 8వ ర్యాంక్​​ జోడీ కిమ్​ ఆస్ట్రప్​-అండర్స్ స్కారుప్​ రాస్ముసేన్​, 6వ ర్యాంక్​ జోడీ హిరోయుకి ఎండో-యుటా వతనాబేపై సంచలన విజయం సాధించింది.

భారత్​కు చెందిన పార్థో గంగూలీ - విక్రమ్ సింగ్ ద్వయం చివరిసారిగా​ 1983 ఫ్రెంచ్​ ఓపెన్ గెలిచింది.

ఇదీ చూడండి:భారత్​-బంగ్లాదేశ్​: ఈడెన్ టెస్టులో 'గులాబీ బంతి'..!

ABOUT THE AUTHOR

...view details