తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సైకత శిల్పం'​తో సింధుకు శుభాకాంక్షలు

ప్రముఖ సైకత శిల్పకర్త సుదర్శన్ పట్నాయక్ పీవీ సింధుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్ స్వర్ణం నెగ్గిన ఆమె చిత్రాన్ని ఇసుకలో రూపొందించి అభినందనలు చెప్పారు.

సింధు

By

Published : Aug 27, 2019, 7:54 AM IST

Updated : Sep 28, 2019, 10:19 AM IST

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచిన పీవీ సింధు విజయానికి చిహ్నంగా ఆమె సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. ఒడిశాలోని పూరి బీచ్​లో సింధు రూపం తయారుచేసి బ్యాడ్మింటన్ క్వీన్​కు అభినందనలు తెలిపారు.

సింధు చిత్రాన్ని రూపొందించిన సుదర్శన్​ పట్నాయక్​

2016 రియో ఒలింపిక్స్​లో సింధు రజతం నెగ్గినప్పుడూ ఇలాగే ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతైన సుదర్శన్ పట్నాయక్ ప్రముఖ వ్యక్తులు, సంఘటనలు జరిగినపుడు సైకత శిల్పాల ద్వారా తన భావాన్ని వ్యక్తపరుస్తుంటారు.

స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో జపాన్​కు చెందిన ఒకుహరపై గెలిచి సింధు స్వర్ణం దక్కించుకుంది. 21-7, 21-7 తేడాతో వరుస సెట్లలో నెగ్గి ఈ టోర్నీలో పసిడి కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్​గా కీర్తి గడించింది.

ఇది చదవండి: విమర్శలకు ఇదే నా సమాధానం: సింధు

Last Updated : Sep 28, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details