తెలంగాణ

telangana

ETV Bharat / sports

మలేషియా ఓపెన్​లో సమీర్​వర్మ ఓటమి - badminton

భారత షట్లర్​ సమీర్​వర్మ మలేషియా ఓపెన్​లో నిరాశపరిచాడు. ప్రపంచ నెంబర్​ 2 ఆటగాడు షి యుకి చేతిలో పోరాడి ఓడిపోయాడు.

మలేషియా ఓపెన్​లో సమీర్​వర్మ ఓటమి

By

Published : Apr 2, 2019, 6:53 PM IST

ఆడిన తొలి మ్యాచ్​లోనే బలమైన ప్రత్యర్థి.. ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడితో పోటీ అంటే మాటలా.. కానీ చివరి అవకాశం వరకు ప్రయత్నించాడు సమీర్​ వర్మ. అద్భుత ప్రదర్శన చేసినా చివరికి నిరుత్సాహపరిచాడు.

  • కౌలాలంపూర్​లో జరిగిన మలేషియా ఓపెన్​లో భారత ఆటగాడు సమీర్​ వర్మ 20-22, 23-21, 12-21 తేడాతో షి యూకి (చైనా)పై పోరాడి ఓడిపోయాడు. 65 నిమిషాల పాటు జరిగిన ఈ సింగిల్స్​ మ్యాచ్​లో చివరకు ఓటమి చవిచూశాడు.
    మలేషియా ఓపెన్​లో సమీర్​వర్మ

డబుల్స్​లోనూ నిరాశే:

అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి ద్వయం తొలి మ్యాచ్​లో ఐర్లాండ్​ క్రీడాకారులపై సత్తా చాటినా.. రెండో మ్యాచ్​లో కొరియా చేతిలో 20-22, 21-17, 20-22 తేడాతో ఓటమిపాలయ్యారు.

డబుల్స్​లోనూ నిరాశే

ABOUT THE AUTHOR

...view details