పారిస్ వేదికగా జరుగుతున్న ఓర్లీన్ మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్.. ఐర్లాండ్ ప్లేయర్ రాచెల్పై విజయం సాధించింది. కేవలం 21 నిమిషాల పాటు జరిగిన పోరులో 21-9, 21-5 తేడాతో ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించింది సైనా.
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందాలంటే.. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. రెండో రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్ మేరీ బాటోమెన్తో తలపడనుంది సైనా. వారం క్రితం జరిగిన ఆల్ఇంగ్లాండ్ ఓపెన్‌లో తొడ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిందీ స్టార్ ప్లేయర్.
భారత పురుషుల సింగిల్స్ మాజీ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్.. మరో భారత షట్లర్ అజయ్ జయరామ్‌పై గెలుపొందాడు. తొలి రౌండ్లో బై సాధించిన శ్రీకాంత్.. రెండో రౌండ్లో 21-15, 21-10తో విజయం సాధించాడు. కాగా, అజయ్ తన తొలి రౌండ్లో సహచరుడు అలప్ మిశ్రాను ఓడించాడు. 19-21, 23-21, 21-16 తేడాతో అలప్ ఓటమి పాలయ్యాడు.