తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​లాండ్​ ఓపెన్: స్టార్ ప్లేయర్లు నిష్క్రమణ - పీవీ సింధు

థాయ్​లాండ్​ ఓపెన్​లో భారత్​ ప్రముఖ షట్లర్లు సైనా, శ్రీకాంత్​ రెండో రౌండ్​లో ఓడిపోయారు. సాయిప్రణీత్ మాత్రం క్వార్టర్స్​లోకి ప్రవేశించాడు. ​

థాయ్​లాండ్​ ఓపెన్: స్టార్ ప్లేయర్లు నిష్క్రమణ

By

Published : Aug 1, 2019, 9:22 PM IST

థాయ్​లాండ్​ ఓపెన్​లో భారత్​కు గురువారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రముఖ బ్యాడ్మింటన్​ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్.. రెండో రౌండ్​లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరో ఆటగాడు సాయి ప్రణీత్ మాత్రం క్వార్టర్స్​లోకి అడుగుపెట్టాడు.

ఏడో సీడ్​ సైనా నెహ్వాల్.. జపాన్​కు చెందిన సయాకా తకాషి చేతిలో 21-16, 11-21, 14-21 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.

ఐదో సీడ్​ శ్రీకాంత్​.. థాయ్​లాండ్​కు చెందిన కోషిట్​ పెత్​ప్రదాబ్​ చేతిలో 21-11, 16-21, 12-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలై ఇంటిముఖం పట్టాడు. ఇతడి బాటలోనే పారుపల్లి కశ్యప్​.. చైనీస్​ తైపీ క్రీడాకారుడు చౌ టైన్​ చెన్​ చేతిలో ఓడిపోయాడు.

గత వారం జపాన్​ ఓపెన్​లో​ సెమీస్​కు చేరిన సాయిప్రణీత్.. ఈ టోర్నీలోనూ అదే ఫామ్​ కొనసాగిస్తూ క్వార్టర్స్​లో అడుగుపెట్టాడు. శుభంకర్​పై 21-18, 21-19 తేడాతో గెలిచాడు.

పురుషుల డబుల్స్​ విభాగంలో సాత్విక్ సాయిరాజ్​-చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. మిక్స్​డ్​ డబుల్స్​లో జెర్రీ చోప్రా- సిక్కి రెడ్డి జోడి.. హాంకాంగ్​కు చెందిన టాంగ్​ మన్-సే యింగ్ సూట్​ చేతిలో ఓడారు.

ఇది చదవండి: థాయ్​లాండ్​ ఓపెన్​ నుంచి సైనా ఔట్

ABOUT THE AUTHOR

...view details