తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనాలో సత్తా చాటుతున్న సైనా, సింధు - sindhu

ఆసియా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో సైనా, సింధు రెండో రౌండుకు చేరుకున్నారు. తొలిరౌండ్​లో జపాన్​కు చెందిన తాకాషిని సింధు ఓడించగా.. చైనా క్రీడాకారిణీ హ్యాన్​పై విజయం సాధించింది సైనా.

సైనా - సింధు

By

Published : Apr 24, 2019, 3:57 PM IST

చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. స్టార్ ఆటగాళ్లైన సైనా, సింధు రెండో రౌండుకు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్​లో సమీర్​వర్మ జపాన్​కు చెందిన సకాయ్​పై విజయం సాధించాడు.

జపాన్​కు చెందిన తాకాషి సాయకాను వరుస సెట్లలో ఓడించింది సింధు. 21-14, 21-7 తేడాతో కేవలం 28 నిమిషాల్లోనే ఆట ముగించింది. తర్వాతి మ్యాచ్​లో​ ఇండోనేషియాకు చెందిన చోయిరున్నిసాతో తలపడనుంది సింధు.

సైనా నెహ్వాల్ చైనా క్రీడాకారిణీ హ్యాన్​యూపై విజయం సాధించింది. 12-21, 21-11, 21-17 తేడాతో గెలిచింది. మొదటి సెట్​ను చేజార్చుకున్న సైనా మిగతా సెట్లలో పుంజుకుని హ్యాన్​ యూను ఓడించింది. తర్వాతి మ్యాచ్​ ఒలింపిక్ కాంస్యం విజేత దక్షిణకొరియాకు చెందిన కిమ్​​తో తలపడనుంది సైనా.

పురుషుల సింగిల్స్​లో సమీర్ వర్మ జపాన్​కు చెందిన సకాయ్ కజుమాసాపై 21-13, 17-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్​లో అర్జున్- రామాచంద్రన్ జోడీ చైనా ద్వయం చేతిలో పరాజయం పాలైంది. నేడు కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియాకు చెందిన షేసార్ హిరెన్​తో తలపడనున్నాడు

ABOUT THE AUTHOR

...view details