ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ జ్యూవెలర్స్ స్టోర్‌లో నూతన కలెక్షన్లను సైనా ఆవిష్కరించారు. డైమండ్ జ్యూవెలరీ అంటే తనకు ఇష్టమని వెల్లడించారు. ఫ్యాషన్ ఎప్పుడూ సౌకర్యవంతంగా, ఎదుటివారికి నచ్చే విధంగా ఉండాలని సూచించారు.
ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యం: సైనా నెహ్వాల్ - saina nehwal latest news
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పీఎంజే జ్యూవెలర్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సందడి చేశారు. నూతన కలెక్షన్లను ఆమె ఆవిష్కరించారు. అనంతరం విభిన్న డిజెన్లలలో రూపొందించిన గాజులను ఆమె తిలకించారు.
సైనా నెహ్వాల్
టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు సైనా వివరించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే శిక్షణ సాగించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన