తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్​లో సైనా, సింధు - saina nehwal in french open

ఫ్రెంచ్ ఓపెన్​లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్స్​ చేరారు. డెన్మార్క్ క్రీడాకారిణి లినె మార్క్​పై సైనా, సింగపూర్​కు చెందిన యో జియా మిన్​పై సింధు గెలుపొందారు.

సైనా

By

Published : Oct 24, 2019, 9:12 PM IST

Updated : Oct 24, 2019, 10:44 PM IST

భారీ ఆశలతో ఫ్రెంచ్ ఓపెన్​ బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్స్​ చేరారు. రెండో రౌండ్​లో డెన్మార్క్ క్రీడాకారిణి లినె మార్క్​పై వరుస సెట్లలో 21-10, 21-11 తేడాతో గెలుపొందింది సైనా. సింగపూర్​కు చెందిన యో జియా మిన్​పై 21-10, 21-13 తేడాతో గెలిచింది సింధు.

ఇప్పటికే వరుసగా మూడు టోర్నీల్లో ప్రారంభ రౌండ్లలోనే ఓడి ఇంటిముఖం పట్టారు వీరిద్దరూ. ఈ టోర్నీలో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు.

సైనా కొరియాకు చెందిన అన్ సె యంగ్​తో క్వార్టర్స్​లో తలపడనుంది. తైజూ యంగ్​- కిమ్ యున్​లో గెలిచిన క్రీడాకారిణితో పోటీపడనుంది సింధు.

ఇవీ చూడండి.. రెండు స్థానాలు పడిపోయిన బ్లూ టైగర్స్​

Last Updated : Oct 24, 2019, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details