తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనా ఓపెన్​ నుంచి సైనా నెహ్వాల్ ఔట్ - సైనా నెహ్వాల్

చైనా ఓపెన్​ తొలి రౌండ్​లోనే ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది భారత ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వల్​

By

Published : Sep 18, 2019, 10:25 AM IST

Updated : Oct 1, 2019, 1:00 AM IST

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వల్​కు చైనా ఓపెన్​ తొలి రౌండ్​లోనే చుక్కెదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్​లో థాయ్​లాండ్​కు చెందిన బుసనన్​ చేతిలో 10-21, 17-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. 45 నిమిషాల్లోనే ఈ పోరు ముగిసింది.

చైనా ఓపెన్​ తొలి రౌండ్​ వివరాలు

ఈ సీజన్​లో బుసనన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి. గాయాలతో ఇబ్బంది పడుతున్న నెహ్వాల్.. ఇటీవలే కోలుకుని చైనా ఓపెన్​లో అడుగుపెట్టింది. కానీ తొలిరౌండ్​లోనే నిష్క్రమించింది. ఇండోనేసియా ఓపెన్​లో విజయంతో ఈ సీజన్​ను ఆరంభించిన సైనా.. మిగతా వాటిలో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.

ఇది చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్​రౌండర్

Last Updated : Oct 1, 2019, 1:00 AM IST

ABOUT THE AUTHOR

...view details