తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత షట్లర్ల శుభారంభం - శ్రీకాంత్

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత షట్లర్లు తొలిరోజు సత్తా చాటారు. ప్రణయ్, సాయి ప్రణీత్ రెండో రౌండ్​లోకి ప్రవేశించారు.

ప్రపంచ ఛాంపియన్​షిప్

By

Published : Aug 19, 2019, 6:47 PM IST

Updated : Sep 27, 2019, 1:31 PM IST

స్విట్జర్లాండ్​లో బాసెల్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్​లో సాయి ప్రణీత్, హెచ్​.ఎస్ ప్రణయ్ తొలి రౌండ్​లో విజయం సాధించి రెండో రౌండ్​కు చేరుకున్నారు.

కెనాడాకు చెందిన 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోనిని 21-17, 21-16 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు ప్రణీత్. ఈ గేమ్​ను కేవలం 39 నిమిషాల్లోనే ముగించాడు.

మరో షట్లర్ ప్రణయ్.. ఫిన్​ల్యాండ్​కు చెందిన హియినోపై 17-21, 21-10, 21-11 తేడాతో నెగ్గాడు.

మహిళల డబుల్స్​లో భారత జోడి మేఘనా జక్కం​పూడి-ఎస్.పూర్వీషా... గ్వాటిమాలాకు చెందిన డయానా-అలెగ్జాండ్రియాపై 21-10, 21-18 తేడాతో నెగ్గి రెండో రౌండ్​కు చేరుకుంది.

ఇది చదవండి: అక్తర్​కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన యువీ

Last Updated : Sep 27, 2019, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details