మలేసియా మాస్టర్స్‌లో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. కౌలాలంపుర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డెన్మార్క్‌కు చెందిర రస్మస్ జెమ్కే చేతిలో పరాజయం పాలయ్యాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలో 11-21, 15-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు ప్రణీత్. ప్రత్యర్థి పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.