తెలంగాణ

telangana

ETV Bharat / sports

జపాన్​ ఓపెన్​: సాయి ప్రణీత్ ఆరంభం అదుర్స్​ - BWF World Tour Super 750

భారత షట్లర్​ సాయి ప్రణీత్​ జపాన్​ ఓపెన్​ రెండో రౌండ్​లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్​లో ఆతిథ్య దేశ​ ఆటగాడు కెంటా నిషిమోటోపై వరుస సెట్లలో విజయం సాధించాడు.

జపాన్​ ఓపెన్​: సాయిప్రణీత్ ఆరంభమే అదుర్స్​

By

Published : Jul 23, 2019, 2:14 PM IST

Updated : Jul 23, 2019, 4:49 PM IST

జపాన్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​లో భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు సాయి ప్రణీత్​ మంచి ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్​లో జోరు ప్రదర్శించి 10వ సీడ్​ జపాన్​​ ఆటగాడు కెంటాపై 21-17, 21-13 తేడాతో గెలిచాడు. 42 నిముషాల పాటు జరిగిన ఈ పోరులో పైచేయి సాధించాడు 23వ సీడ్​ ప్రణీత్​. ఫలితంగా 'బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్​ సూపర్​-750'గా పిలిచే ఈ టోర్నీలో సాఫీగా రెండో రౌండ్​ చేరాడు. తర్వాతి మ్యాచ్​లో జపాన్​ ప్లేయర్​ కంటా సునేయమాతో తలపడనున్నాడీ తెలుగు తేజం.

అదరగొట్టిన సాయిప్రణీత్​

భారత స్టార్​ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ బుధవారం తొలి మ్యాచ్​ ఆడనున్నారు. ఐదో సీడ్​ సింధు చైనా క్రీడాకారిణి హన్​ యూతో తలపడనుంది. మరో భారత ఆటగాడు హెచ్​.ఎస్​ ప్రణయ్​తో పోటీపడనున్నాడు శ్రీకాంత్​.

మిక్స్​డ్​ డబుల్స్​లో ముందంజ...

జపాన్​ ఓపెన్​మిక్స్​డ్​ డబుల్స్​లో భారత జోడీ సాత్విక్​, అశ్వినీ పొన్నప్ప ముందంజ వేశారు. తొలి మ్యాచ్​లో జర్మనీ ద్వయం మార్విన్​​, లిండాపై 21-14, 21-19 తేడాతో విజయం సాధించారు.​

సాత్విక్​, అశ్వినీ జోడీ

మెన్స్​ నిరాశ...
భారత పురుషుల ద్వయం మను ఆత్రే, సుమీత్​ రెడ్డి మొదటి మ్యాచ్​లోనే ఇంటి ముఖం పట్టారు. 12-21, 16-24 తేడాతో మలేషియా గోజేఫీ, నూర్​ ఇజుద్దీన్​ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.

Last Updated : Jul 23, 2019, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details