తెలంగాణ

telangana

ETV Bharat / sports

డెన్మార్క్​ ఓపెన్​కు శ్రీకాంత్‌తో పాటు కోచ్‌, ఫిజియో - శ్రీకాంత్‌తో పాటు కోచ్‌, ఫిజియో

డెన్మార్క్ ఓపెన్ కోసం తన వెంట ఫిజియోను తీసుకెళ్లడానికి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ చేసిన విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది సాయ్. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్‌) పథకంలో ఉన్న శ్రీకాంత్‌ వచ్చే నెల 13న ఆరంభమయ్యే ఆ టోర్నీ కోసం ముందుగానే అక్కడికి వెళ్లేందుకు అనుమతి పొందాడు.

శ్రీకాంత్‌తో పాటు కోచ్‌, ఫిజియో
శ్రీకాంత్‌తో పాటు కోచ్‌, ఫిజియో

By

Published : Sep 20, 2020, 7:28 AM IST

డెన్మార్క్‌ ఓపెన్‌ కోసం తనతో పాటే కోచ్‌, ఫిజియోథెరపిస్ట్‌ను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాలని అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ చేసిన విజ్ఞప్తికి భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) సమ్మతం తెలిపింది. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్‌) పథకంలో ఉన్న శ్రీకాంత్‌ వచ్చే నెల 13న ఆరంభమయ్యే ఆ టోర్నీ కోసం ముందుగానే అక్కడికి వెళ్లేందుకు అనుమతి పొందాడు.

"డెన్మార్క్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు శ్రీకాంత్‌ నుంచి ప్రతిపాదన వచ్చింది. ముందుగానే అక్కడికి వెళ్లడంతో పాటు తనతో కోచ్‌, ఫిజియోథెరపిస్ట్‌ను తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని అతను కోరాడు. అందుకు సాయ్‌ ఒప్పుకుంది. అయితే వాళ్ల పేర్లను ఇంకా ఖరారు చేయలేదు" అని శనివారం సాయ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details