తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2019, 11:24 AM IST

ETV Bharat / sports

'బ్యాడ్మింటన్​ చూడటమే కాదు.. ఆడటమూ పెరగాలి'

థాయ్​లాండ్​ ఓపెన్​​ డబుల్స్​ విజేతలైన భారత యువ షట్లర్లు రంకిరెడ్డి సాత్విక్​-చిరాగ్​ శెట్టి స్వదేశంలో అడుగుపెట్టారు. ఈ ఆటలో ఆడేందుకు యువత మరింత చొరవ చూపాలని హైదరాబాద్​లో ఈటీవీ భారత్​తో మాట్లాడిన సందర్భంగా చెప్పాడు సాత్విక్.

'బ్యాడ్మింటన్​ చూడటమే కాదు.. ఆడటమూ పెరగాలి'

భారత బ్యాడ్మింటన్​లో నయా సంచలనం రంకిరెడ్డి సాత్విక్​ సాయిరాజ్​. థాయ్​లాండ్​ ఓపెన్​లో మరో ఆటగాడు చిరాగ్​ శెట్టి(ముంబయి)తో జంటగా డబుల్స్​ టైటిల్​ నెగ్గాడీ తెలుగుతేజం. బీడబ్ల్యూఎఫ్​ సూపర్​ 500 టోర్నీ కైవసం చేసుకున్న తొలి భారత జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు. అంతటి ప్రతిభావంతుడైన సాత్విక్​... తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో పుట్టి పెరిగాడు. విజేతలుగా హైదరాబాద్​లోని గోపీచంద్​ బ్యాడ్మింటన్​ అకాడమీలో అడుగుపెట్టిన ఈ ద్వయాన్ని.. ఈటీవీ భారత్ పలకరించింది.

భారత యువ షట్లర్లు రంకిరెడ్డి సాత్విక్​-చిరాగ్​ శెట్టి

బ్యాడ్మింటన్​లో డబుల్స్​కు ఆదరణ పెరిగిందని అభిప్రాయపడిన సాత్విక్​... ఈ ఆట ఆడేందుకు ఎక్కువ మంది యువత మరింత చొరవ చూపాలని కోరాడు. ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్​లోని బాసెల్​ వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సత్తా చాటాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. బుధవారం నుంచి మొదలయ్యే హైదరాబాద్​ ఓపెన్​లో ఆడేదానిపై నేడు కోచ్​ ప్లాండి స్పష్టత ఇస్తాడని చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details