ప్రస్తుతం కేరళలో ఉన్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభస్వామి, అట్టుక్కల్ భగవతి ఆలయాలను ఈరోజు సందర్శించింది. ఆమెతో పాటు తల్లి విజయ కూడా ఉన్నారు.
కేరళ టూర్లో సింధు... రూ.10 లక్షల బహుమానం! - sindhu latest news
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీసింధు.. కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి, అట్టుక్కల్ భగవతి ఆలయాలను సందర్శించింది. అనంతరం ఈ షట్లర్‌కు నగదు ప్రోత్సాహకం అందించింది ఆ రాష్ట్ర ఒలింపిక్ సంఘం.
కేరళ ఆలయాల సందర్శనలో పీవీ సింధు
అనంతరం తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో కేరళ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సునీల్ కుమార్.. సింధుకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈ షట్లర్ స్వర్ణ పతకం సాధించడమే ఇందుకు కారణం. సింధు కేరళకు రావడం ఇది రెండోసారి. 2016 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తర్వాత తొలిసారి ఇక్కడికి వచ్చింది.
ఇది చదవండి: బతుకమ్మ సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు
Last Updated : Oct 9, 2019, 2:00 PM IST