తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోచ్​గా వారికి నా అవసరం ఉంది: గోపీచంద్ - gopichand shuttler

క్రీడాకారులకు తన అవసరం ఉన్నందునే ఇంకా కోచ్​గా కొనసాగుతున్నానని, షట్లర్లకు తన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.

గోపీచంద్

By

Published : Nov 14, 2019, 8:17 AM IST

ఈ ఏడాది మన షట్లర్లకు పెద్దగా కలిసిరావడం లేదు. ఫ్రెంచ్, చైనా ఓపెన్లలో భారత క్రీడాకారులు ఆదిలోనే వెనుదిరిగారు. ఈ విషయంపై జాతీయ బ్యాడ్మింటన్ కోచ్​ పుల్లెల గోపీచంద్ స్పందించారు. వారిపై ఒత్తిడి ఉందని తెలిపాడు. క్రీడాకారులకు తన అవసరం ఉన్నందునే కోచ్‌గా కొనసాగుతున్నట్లు చెప్పాడు.

"నిజాయతీగా చెప్పాలంటే కోచ్‌ పదవి నాకు భారంగా, బాధ్యతగా అనిపిస్తుంది. ఇంత గొప్ప ప్రదర్శనల్ని విడిచి వెళ్లలేను. క్రీడాకారులకు నా అవసరం ఉంది. అంతర్గతంగా అది నాపై భారమే. అందుకే కోచ్‌ విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యా. నా వారసుడి గురించి కూడా ఆలోచించలేదు."

-పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్​

సింధు త్వరలో మళ్లీ పుంజుకుంటుందని ఒలింపిక్స్​కు అర్హత సాధించి సత్తాచాటుతుందని అన్నాడు గోపీచంద్.

"ఆమె(సింధు) గొప్ప క్రీడాకారిణి. పెద్ద టోర్నమెంట్లలో అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తుంది. గతేడాది అదే జరిగింది. అక్టోబరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ రానున్న టోర్నీల్లో ఆమె సత్తాచాటుతుందనే నమ్మకం నాకుంది. డబుల్స్ జోడీ సాత్విక్ - చిరాగ్ కూడా అద్భుతంగా ఆడుతోంది."

-పుల్లెల గోపీచంద్​, బ్యాడ్మింటన్ కోచ్.


ఇదీ చదవండి: బంగ్లాతో సిరీస్​లో కోహ్లీ ఈ రికార్డులు అందుకుంటాడా..
?

ABOUT THE AUTHOR

...view details