బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ వేలం దిల్లీలోమంగళవారం నిర్వహించారు. ఇందులో భారత షట్లర్లతో పాటు విదేశీ క్రీడాకారులను కోనుగోలు చేశాయి ఫాంచైజీలు. తెలుగు షట్లర్ పీవీ సింధును హైదరాబాద్ హంటర్స్ అత్యధిక ధర(రూ. 77లక్షల) చెల్లించి తమవద్దే అట్టిపెట్టుకుంది.
వరల్డ్ నెంబర్ వన్ కోసం తీవ్ర పోటీ
ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తైజు ఇంగ్(చైనా)ను రూ. 77 లక్షలకు బెంగళూరు ర్యాప్టర్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ షటర్ కోసం పుణె సెవన్ ఎసర్స్ దక్కించుకొనే ప్రయత్నం చేసి విఫలమైంది. భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్నూ రూ.32లక్షలు చెల్లించి తమ వద్దే ఉంచుకుంది బెంగళూరు.
పురుషుల డబుల్స్‌లో కీలక షట్లర్లైన సుమిత్ రెడ్డిని రూ.11 లక్షలకు చెన్నై సూపర్ స్టార్జ్ తన వద్దే అట్టిపెట్టుకోగా.. చిరాగ్ శెట్టిని రూ.15.50 లక్షలకు రిటైన్ చేసుకుంది పుణె. మహిళల సింగిల్స్‌లో అమెరికా ప్లేయరైన బీవాన్ ఝంగ్ను రూ.39 లక్షలు చెెల్లించి. తన వద్దే ఉంచుకుంది అవధ్ వారియర్స్.
చెన్నైకు గోపీచంద్ కుమార్తె
జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పులెల్ల గోపీచంద్ కూమార్తె గాయత్రి గోపీచంద్‌ను చెన్నై సూపర్ స్టార్జ్ రూ.3 లక్షలకు దక్కించుకుంది. అసోం షట్లర్ అస్మితా చాలిహాను నార్త్ ఈస్టర్న్ వారియర్స్ రూ.3లక్షలకు సొంతం చేసుకుంది.