భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, మిచెల్లీ లి(కెనడా) లకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తున్న 'బిలీవ్ ఇన్ స్పోర్ట్స్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వీరు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. ఈ గౌరవం తనకు దక్కడంపై సింధు హర్షం వ్యక్తం చేసింది. గతేడాది ఏప్రిల్‌లో 'ఐ యామ్ బ్యాడ్మింటన్' క్యాంపైన్‌కు వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.
పీవీ సింధుకు గౌరవం.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక - PV Sindhu Believe in Sports ambassador
'బిలీవ్ ఇన్ స్పోర్ట్స్' కార్యక్రమానికి స్టార్ షట్లర్ పీవీ సింధు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వెల్లడించింది.
![పీవీ సింధుకు గౌరవం.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక pv sindhu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11630007-1074-11630007-1620053406772.jpg)
పీవీ సింధు
2018లో 'బిలీవ్ ఇన్ స్పోర్ట్స్' క్యాంపైన్‌ను ప్రారంభించారు. పోటీల్లో జరిగే అవకతవకలు పట్ల అథ్లెట్స్, కోచ్‌లు సహా ఇతర అధికారులకు దీని ద్వారా అవగాహన కల్పిస్తారు.
ఇదీ చూడండి: 'మన్ కీ బాత్': మిథాలీ, సింధుపై మోదీ ప్రశంసలు