ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ నుంచి భారత షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ పోర్న్‌పావీ చోచువాంగ్ చేతిలో 17-21, 9-21 తేడాతో పరాజయం పాలైంది.
మొదటి రౌండ్లో 6-9తో సిందుకు మెరుగైన ఆరంభం లభించినప్పటికీ.. ప్రత్యర్థి సమర్థంగా పుంజుకుంది. సింధుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మెరుగైన ప్రదర్శన చేసింది. ప్రపంచ 11వ సీడ్ షట్లర్ అయిన చోచువాంగ్.. గత కొద్ది నెలల్లో తన ఆటతీరును చాలా మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలోనే సింధును ఓడించింది.