తెలంగాణ

telangana

ETV Bharat / sports

జపాన్​ ఓపెన్​: క్వార్టర్స్​కే పరిమితమైన సింధు - etvbharat sports

జపాన్​ ఓపెన్​ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది సింధు. శుక్రవారం జపాన్​ క్రీడాకారిణి అకానే యమగూచితో జరిగిన పోరులో ఓటమిపాలైంది.

జపాన్​ ఓపెన్​: క్వార్టర్స్​కే పరిమితమైన సింధు

By

Published : Jul 26, 2019, 1:41 PM IST

ప్రతిష్ఠాత్మక జపాన్​ ఓపెన్​లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన పీవీ సింధు తీవ్ర నిరాశపరిచింది. టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన తెలుగుతేజం క్వార్టర్స్​లోనే ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జపాన్​ క్రీడాకారిణి అకానే యమగూచితో జరిగిన పోరులో 18-21, 15-21 తేడాతో ఓటమిపాలైంది.

ఈ టోర్నీకి ముందు ఇండోనేసియా ఓపెన్​లో పీవీ సింధు రన్నరప్​గా నిలిచింది. జపాన్​కు చెందిన యమగూచి చేతిలోనే ఫైనల్లో ఓడిపోయింది.

ఇండోనేషియా ఓపెన్​లో సింధు, యమగూచి

ఇవీ చూడండి...జపాన్​ ఓపెన్​: సెమీస్​లో అడుగుపెట్టిన సాయి ప్రణీత్​

ABOUT THE AUTHOR

...view details