కొంతకాలంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. రాజకీయనాయకులు, సినీతారలు, క్రీడాకారులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ఫొటోలను సామాజికమ మాధ్యమాల్లో పంచుకుంది సింధు.
"నన్ను నామినేట్ చేసినందుకు తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇస్తున్నాను."
-సింధు, బ్యాడ్మింటన్ స్టార్