తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరోసారి సింధు విఫలం.. కశ్యప్ ఇంటిముఖం - PV Sindhu

హాంకాంగ్ ఓపెన్​ రెండో రౌండ్​లో భారత స్టార్​ షట్లర్ సింధుతో పాటు పారుపల్లి కశ్యప్ ఓటమి పాలయ్యాడు. శ్రీకాంత్​ క్వార్టర్​ ఫైనల్​కు చేరుకున్నాడు.

సింధు

By

Published : Nov 14, 2019, 9:11 PM IST

హాంకాంగ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీ రెండో రౌండ్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ఓటమిపాలయ్యారు. ఇప్పటికే వరుస టోర్నీల్లో నిరాశపర్చిన సింధు ఈ టోర్నీలోనూ విఫలమవడం ఆందోళన కలిగించే విషయం.

ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన తర్వాత మరే టోర్నీలోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది సింధు. తాజాగా హాంకాంగ్ ఓపెన్​ రెండో రౌండ్​లో బుసానన్​ చేతిలో 18-21, 21-11, 16-21 తేడాతో పరాజయం చెందింది. ఫలితంగా ఈ టోర్నీలో భారత మహిళల సింగిల్స్​ పోరు ముగిసింది. ఇప్పటికే సైనా తొలి రౌండ్​లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.

మరో ఆటగాడు పారుపల్లి కశ్యప్​ చౌ టియాన్​ చెన్ చేతిలో 21-12, 23-21, 21-10 తేడాతో ఓటమిపాలయ్యాడు. ప్రస్తుతం శ్రీకాంత్​పైనే ఆశలున్నాయి. ఈ ఆటగాడు సౌరభ్​ వర్మపై గెలిచి క్వార్టర్​ ఫైనల్స్ చేరాడు.

ఇవీ చూడండి.. 'విరామ సమయంలో హ్యాట్రిక్​ గురించే ఆలోచించా'

ABOUT THE AUTHOR

...view details