డెన్మార్క్‌లో జరగనున్న థామస్ ఉబర్‌కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నుంచి స్టార్ షట్లర్ పీవీ సింధు తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయమై సింధుకు నచ్చజెప్పిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రెసిడెంట్ హిమంత బిశ్వ శర్మ ఆమెను ఒప్పించినట్లు తెలిపారు. ఈ టోర్నీలో సింధు ఆడుతుందని స్పష్టం చేశారు.
"థామస్ ఉబర్ కప్‌లో ఆడాలని పీవీ సింధును కోరా. మనకు అనుకూలమైన డ్రా వచ్చిందని, పతకం గెలిచే అవకాశం ఉందని చెప్పా. ఇందుకు సింధు అంగీకరించింది. ఆమె ఈ టోర్నీలో ఆడుతుంది."