తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్​ జీవిత కథతో పుస్తకం

పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్న పుల్లెల గోపీచంద్.. జీవిత కథతో పుస్తకం విడుదలైంది. భావితరాల క్రీడాకారులు స్పూర్తి పొందేలా ఈ బుక్​ ఉంటుందని రచయిత్రి చెప్పారు.

pullela gopichand
గోపీచంద్

By

Published : Nov 12, 2021, 9:18 PM IST

ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ జీవిత కథను 'షట్లర్ల్స్‌ ఫ్లిక్‌' పేరుతో ప్రముఖ రచయిత్రి ప్రియకుమార్‌ రచించింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌ ఐఎస్‌బీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గోపీచంద్‌ తన బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో 2016 ఒలింపిక్స్‌ విజయం తర్వాత జరిగిన సన్మానాలు, క్రీడాకారుణిగా, శిక్షకుడిగా తన ప్రయాణాన్ని పుస్తకంలో పొందిపరిచినట్లు గోపీచంద్‌ తెలిపారు.

గోపీచంద్ జీవిత కథతో రాసిన బుక్

ఆరు నెలల్లో పుస్తకం పూర్తిచేసే తాను గోపీచంద్‌ బయోగ్రఫీ పుస్తకాన్ని తయారు చేయడానికి మూడు సంవత్సరాలు పట్టినట్లు రచయిత్రి ప్రియకుమార్‌ చెప్పారు. భావితరాల క్రీడాకారులు స్ఫూర్తి పొందేలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details