పారిస్ వేదికగా జరుగుతున్న ఓర్లీన్ మాస్టర్స్ సెమీస్లో భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల డబుల్స్ జోడీ ముందడుగు వేయగా.. మహిళల జోడీ ఓటమిపాలైంది.
ఇంగ్లాండ్కు చెందిన కల్లమ్ హెమ్మింగ్-స్టీవ్ స్టాల్వుడ్ జంటను ఓడించి.. క్రిష్ణ ప్రసాద్-విష్ణు వర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 35 నిమిషాల పాటు సాగిన ఆటలో 21-17, 21-17 తేడాతో రెండు వరుస రౌండ్లలో ప్రత్యర్థి జోడీని మట్టికరిపించింది భారత ద్వయం. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
సైనా ఓటమి..
భారత సింగిల్స్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. ఓర్లీన్ మాస్టర్స్ నుంచి నిష్క్రమించింది. సెమీ ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫర్సన్తో తలపడిన సైనా.. 21-17, 21-17 తేడాతో పరాజయం పాలైంది. కేవలం 28 నిమిషాల పాటు సాగిన ఆటలో సైనాను ఎక్కడా కోలుకోనివ్వలేదు ప్రత్యర్థి.
మహిళల జోడీ పరాజయం..
భారత మహిళల డబుల్స్ జంట అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి సెమీస్లో ఓటమి పాలైంది. థాయ్లాండ్ జోడీ జోంగ్కోల్ఫాన్ కితితారకుల్-రవిందా ప్రజోంగ్.. 21-18, 21-8తో భారత మహిళల డబుల్స్ జంటపై విజయం సాధించింది.
ఇదీ చదవండి:ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ కొత్త జెర్సీ ఇదే