తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఓర్లీన్ మాస్టర్స్: క్వార్టర్స్​లో శ్రీకాంత్, సైనా - saina nehwal news

ఓర్లీన్ మాస్టర్స్​లో క్వార్టర్స్​లోకి అడుగుపెట్టారు భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్. పారిస్​ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది.

Orleans Masters 2021: Saina, Srikanth into quarters
ఓర్లీన్ మాస్టర్స్: క్వార్టర్స్​లో శ్రీకాంత్, సైనా

By

Published : Mar 26, 2021, 6:28 AM IST

ఒలింపిక్స్‌ బెర్తు వేటలో ఉన్న భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌.. ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ సైనా 18-21, 21-15, 21-10తో మారీ (ఫ్రాన్స్‌)ను ఓడించింది. మరో భారత షట్లర్‌ ఐరా శర్మ ముందంజ వేసింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ ప్రపంచ 162వ ర్యాంకర్‌ 21-8, 21-13తో మరియా మిసోవా (బల్గేరియా)ను ఓడించింది.

పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ క్వార్టర్స్‌ చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో 21-17, 22-20తో చెమ్‌ వీయ్‌ (మలేసియా)పై చెమటోడ్చి గెలిచాడు. మరో భారత షట్లర్‌ మిథున్‌ మంజునాథ్‌ 21-23, 21-9, 22-24తో కయ్‌ (జర్మనీ) చేతిలో ఓడాడు.

సైనా నెహ్వాల్

మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప క్వార్టర్స్‌ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి జోడీ 21-9, 17-21, 21-19తో అమేలీ-ఫ్రెజా (డెన్మార్క్‌)పై పోరాడి గెలిచారు. పురుషుల డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌, కృష్ణ ప్రసాద్‌-విష్ణువర్దన్‌ కూడా రెండో రౌండ్‌ చేరారు. అర్జున్‌-ధ్రువ్‌ 21-14, 21-16తో మాథ్యూ క్లేర్‌-లీవెన్‌ (ఇంగ్లాండ్‌)పై, ప్రసాద్‌ జంట 21-10, 21-17తో ఫౌజాన్‌-హబీబ్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details