తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: సింధు, ప్రణీత్​కు సులువైన డ్రా - చిరాగ్​ సాత్విక్​ రాజ్​ ఒలింపిక్స్​ డ్రా

ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్​ లీగ్​ దశకు సంబంధించిన డ్రాను ప్రకటించారు. భారత స్టార్​ షట్లర్స్​ పీవీ సింధు, ప్రణీత్​కు సులువైన డ్రా పడింది. చిరాగ్​-సాత్విక్​సాయిరాజ్ ద్వయంకు కొంచెం కష్టమైన ప్రత్యర్థులను ఎదుర్కొనున్నారు.

olympics
ఒలింపిక్స్​

By

Published : Jul 9, 2021, 5:30 AM IST

Updated : Jul 9, 2021, 9:48 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో స్టార్​ షట్లర్స్​ పీవీ సింధు, ప్రణీత్​కు సులువైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్​లో ఆరో సీడ్​ సింధు.. ప్రపంచ నంబర్​ 34 చిగ్​ గన్​ యై( Cheung Ngan Yi), సెనియా పొలికర్పొవా(ఇజ్రాయెల్​)తో తలపడనుండగా.. పురుషుల సింగిల్స్​లో వరల్డ్​ నెం.29 మార్క్​ కాలిజో(Mark Caljouw, నెథర్లాండ్స్​), మిషా జిల్బర్​మన్​(ఇజ్రాయెల్​)ను ఎదుర్కొననున్నాడు.

చిరాగ్​ శెట్టి- సాత్విక్ ​సాయిరాజ్​ జోడీకి మాత్రం బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనున్నారు. ఈ ద్వయం కెవిన్​ సంజయ్ సుకముల్జొ, మార్కస్​ ఫెర్​నాల్డి(ఇండోనేషియా), లీ యంగ్​, వాంగ్​ చి లిన్​(చైనా) జోడీ, ఇంగ్లాండ్​ ద్వయం బెన్ లాన్​, సీన్​ వెండీతో తలపడనున్నారు. సింగిల్స్​లో ప్రతిబృందంలోని టాప్​లో నిలిచిన ప్లేయర్​ నాకౌట్​ దశకు అర్హత సాధిస్తారు.

ఇదీ చూడండి: Olympics: స్వర్ణం సాధించాలని.. కోటి ఆశలు సింధుపైనే

Last Updated : Jul 9, 2021, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details