పారాలింపిక్స్(paralympics india) బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన ప్రమోద్ భగత్‌కు(pramod bhagat gold medal) రూ.6 కోట్ల నజరానా ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. దీనితో పాటే గ్రూప్ ఏ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఇటీవల జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ డేనియల్ బెతెల్‌ను ఓడించిన ప్రమోద్.. ఈ విభాగంలో మన దేశం తరఫున తొలి గోల్డ్ గెలిచిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.
నాలుగేళ్ల వయసులోనే పోలియో ప్రభావంతో దివ్యాంగుడు అయిన ప్రమోద్.. పక్కింటి వాళ్లు ఆడుతుంటే చూసి క్రీడల వైపు వచ్చాడు. 2006లో తొలిసారి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న ఇతడు.. తన ఖాతాలో దాదాపు 45 అంతర్జాతీయ పతకాలు జమ చేశాడు. ఇందులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, 2018 ఆసియా గేమ్స్(asian games 2018) గోల్డ్ కూడా ఉంది.
గత కొన్నేళ్లు కోచ్‌గా పనిచేసిన ప్రమోద్.. 2019లోదానికి విరామమిచ్చి, పారాలింపిక్స్ క్వాలిఫికేషన్‌పై దృష్టిపెట్టాడు. ఆ తర్వాత అర్హత సాధించి, ఏకంగా గోల్డ్ చేజిక్కుంచుకున్నాడు. క్రీడల్లో ప్రతిభ చూపినందుకుగానూ 2019లో ఇతడిని అర్జున(arjuna award), బిజు పట్నాయక్ అవార్డులు కూడా వరించాయి.
అర్జున అవార్డుతో ప్రమోద్ భగత్ ఇవీ చదవండి: