తెలంగాణ

telangana

ETV Bharat / sports

జపాన్​ ఓపెన్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు - shuttler

జపాన్ ఓపెన్​లో భారత షట్లర్​ పీవీ సింధు శుభారంభం చేసింది. చైనా ప్లేయర్ హన్​యూను తొలి రౌండ్​లో ఓడించింది. పురుషుల సింగిల్స్​ విభాగంలో హెచ్​ఎస్ ప్రణయ్​.. కిదాంబి శ్రీకాంత్​ను ఓడించాడు.

జపాన్ ఓపెన్

By

Published : Jul 24, 2019, 6:11 PM IST

జపాన్ ఓపెన్​లో బుధవారం భారత్​ మిశ్రమ ఫలితాలు అందుకుంది. పీవీ సింధు, ప్రణయ్ రెండో రౌండ్​కు చేరుకోగా.. కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ తొలిరౌండ్​లోనే ఓడి ఇంటిముఖం పట్టారు. పురుషుల డబుల్స్​ విభాగంలో సాత్విక్ - రాంకీ రెడ్డి జోడీ విజయాన్ని అందుకుంది.

ఐదో సీడ్ పీవీ సింధు.. ఇండోనేసియా ఓపెన్​లోని ఫామ్​ను ఇక్కడా కొనసాగించింది. చైనా క్రీడాకారిణి హన్​యూను 21-9, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి విజయాన్ని అందుకుంది. రెండో రౌండ్​లో జపాన్​కు చెందిన ఒహోరితో తలపడనుంది.

పురుషుల సింగిల్స్ విభాగంలో మన క్రీడాకారులు ప్రణయ్ - శ్రీకాంత్ తలపడ్డారు. 59 నిమిషాలు సాగిన ఈ పోటీలో ప్రణయ్ పైచేయి సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో 13-21, 21-11, 22-20 పాయింట్ల తేడాతో శ్రీకాంత్​ పరాజయం చెందాడు.

డెన్మార్క్​కు చెందిన ఆండెర్స్​ చేతిలో ఓడాడు సమీర్ వర్మ. 46 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చెందాడు​.

పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ ​సాయిరాజ్​ - రాంకీ రెడ్డి జోడి ఇంగ్లాండ్ ద్వయం మార్కస్ - క్రిస్ లాంగ్రిడ్జ్​పై గెలిచింది. 21-16, 21-17 తేడాతో ఓడించి రెండో రౌండ్​కు చేరుకుంది. తర్వాత మ్యాచ్ కొరియా - చైనా జోడి మ్యాచ్​లో గెలిచిన వారితో ఆడనుంది.

మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప - సిక్కి రెడ్డి జోడి కొరియాకు చెందిన ఇయాంగ్ కిమ్ - హీ యాంగ్ కాంగ్​ ద్వయం చేతిలో పరాజయం చెందింది. మిక్స్​డ్​ డబుల్స్​లో ప్రణవ్ - సిక్కి రెడ్డి జోడి చైనా ద్వయంపై ఓడి ఇంటిముఖం పట్టింది.

ఇది చదవండి: 'టోక్యో' ఒలింపిక్స్​ పతకాల ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details