తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా నేపథ్యంలోనూ 'ఇండియా ఓపెన్' టోర్నీ - బ్యాడ్మింటన్ లేటేస్ట్ న్యూస్

ఇండియా ఓపెన్ టోర్నీ షెడ్యూల్​ ప్రకారమే జరగనుంది. అయితే కరోనా రెండో దశ ప్రభావం వల్ల, ప్రేక్షకులు ఎవర్ని మ్యాచ్​లు చూసేందుకు అనుమతించట్లేదని బాయ్ స్పష్టం చేసింది.

India Open set to be held behind closed doors
కరోనా నేపథ్యంలోనూ 'ఇండియా ఓపెన్' టోర్నీ

By

Published : Apr 13, 2021, 3:47 PM IST

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్​ టోర్నీని వచ్చే నెల 11 నుంచి 16వ తేదీల మధ్య దిల్లీ వేదికగా నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా టోర్నీని ప్రేక్షకులు లేకుండానే జరపనున్నామని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్) మంగళవారం వెల్లడించింది.

ఈ టోర్నీలో 33 దేశాల నుంచి 228 ప్లేయర్లు పాల్గొనున్నారు. ఇందులో కరోలినా మారిన్, యమగూచి, పీవీ సింధు, అన్ సే యంగ్ తదితర మహిళ షట్లర్లు ఉన్నారు. మనదేశం నుంచి అత్యధికంగా 48మంది(27 మహిళలు+21 పురుషులు) షట్లర్లు ఇండియా ఓపెన్ బరిలో ఉన్నారు.

దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మిడిల్ ఈస్ట్, ఐరోపా నుంచి వచ్చే ఆటగాళ్లు, అధికారులు తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలి. అంటే మే 3నే వారు దిల్లీకి రావాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details