లిథువేనియా వేదికగా జరిగిన ఆర్ఎస్ఎల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలోని మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ మాల్వికా బన్సోడ్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో ఐర్లాండ్‌కు చెందిన రాచెల్ డరాగ్ను 21-14, 21-11 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
లిథువేనియా బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా మాల్విక - లిథువేనియా బ్యాడ్మింటన్ టోర్నీ
ఆర్ఎస్ఎల్ లిథువేనియా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ మాల్వికా బన్సోడ్ సత్తా చాటింది. ఆదివారం టోర్నీలో జరిగిన తుదిపోరులో రాచెల్ డరాగ్(ఐర్లాండ్)ను ఓడించి విజేతగా నిలిచింది.
లిథువేనియా బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా మాల్విక
గతనెలలో జరిగిన ఆస్ట్రియన్ ఓపెన్‌లో పతకాన్ని చేజార్చుకున్న మాల్వికా.. అంతకుముందు ఉగాండాలో బంగారు పతకాన్ని సాధించింది. ఆరు నెలల వ్యవధిలో ఆమెకిది రెండో స్వర్ణం కావడం విశేషం. ఆగస్టులో జరగనున్న మరో అంతర్జాతీయ టోర్నీలో మాల్విక పాల్గొననుంది.
ఇదీ చూడండి..Olympics: 'కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి'
Last Updated : Jun 14, 2021, 12:56 PM IST