తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మలేసియా ఓపెన్'​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు - srikanth

మలేషియా ఓపెన్​లో కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్​లో ప్రవేశించాడు. థాయ్​లాండ్​కు చెందిన కోసిట్​ని 21-11, 21-15 తేడాతో ఓడించాడు. మరోవైపు సింధు పరాజయం చెంది ఇంటిముఖం పట్టింది.

సింధు-శ్రీకాంత్

By

Published : Apr 4, 2019, 7:50 PM IST

కౌలాలంపూర్​లో జరుగుతున్న మలేసియా ఓపెన్​లో కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్​లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో థాయ్​లాండ్​కి చెందిన కోసిట్​ను 21-11, 21-15 తేడాతో వరస సెట్లలో ఓడించాడు. మహిళల సింగిల్స్​లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వెనుదిరిగింది.

గత వారం ఇండియా ఓపెన్​ రన్నరప్​గా నిలిచిన శ్రీకాంత్ అదే ఊపును కొనసాగిస్తున్నాడు. కోసిట్​తో మ్యాచ్​ను అరగంటలోనే ముగించడం విశేషం. తర్వాతి రౌండ్​లో ఒలింపిక్​ ఛాంపియన్.. చైనాకు చెందిన నాలుగో సీడ్ ఆటగాడు చెన్​ లాంగ్​తో తలపడనున్నాడీ తెలుగుతేజం.

ప్రపంచ పదో ర్యాంకర్ కొరియాకు చెందిన సంగ్ జీ హ్యా చేతిలో పరాజయం చెందింది పీవీ సింధు. 18-21, 7-21 తేడాతో ఓడిపోయింది తెలుగమ్మాయి. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్​షిప్​, గత ఏడాది జరిగిన హాంగ్​కాంగ్ ఓపెన్​లోనూ సింధు సంగ్ జీ చేతిలోనే ఓడిపోవడం గమనార్హం.

మిక్స్​డ్ డబుల్స్​లో ప్రణవ్ చోప్రా- సిక్కి రెడ్డి జోడి మలేసియాకు చెందిన టాన్ కియాన్ మెంగ్- లై పే జింగ్ చేతిలో పరాజయం పాలైంది. 21-15 తేడాతో తొలి రౌండ్లో నెగ్గినా... అనంతరం 17-21, 13-21 తేడాతో మ్యాచ్​ ఓడిపోయింది

ABOUT THE AUTHOR

...view details