తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాడ్మింటన్​ ప్రపంచ నెం.1కు ప్రమాదం, డ్రైవర్​ మృతి - Badminton world number one Kento Momota

బ్యాడ్మింటన్​ ప్రపంచ నెం.1, జపాన్​కు చెందిన కెంటో మోమోటా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మలేషియాలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్​ మరణించగా.. ఆటగాడు సహా మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. జనవరి 12న ముగిసిన మలేషియా మాస్టర్స్​లో పురుషుల సింగిల్స్​లో ఇతడు విజేతగా నిలవడం విశేషం.

Malaysia Masters Winner, World No.1 Kento Momota injured in crash in Malaysia, driver killed
రోడ్డు ప్రమాదంలో బ్యాడ్మింటన్​ ప్రపంచ నెం.1కు గాయాలు, డ్రైవర్​ మృతి

By

Published : Jan 13, 2020, 12:31 PM IST

కొత్త ఏడాదికి కొత్త టైటిల్​తో ఘన స్వాగతం పలికిన ప్రపంచ ఛాంపియన్​ కెంటో మోమోటా(జపాన్​) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు . టైటిల్​ గెలిచి స్వదేశానికి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది.

ఏమైంది..?

జనవరి 12 ముగిసిన మలేషియా మాస్టర్స్​ ఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్​ విక్టర్​ అక్సెల్సన్​పై... గెలిచి టైటిల్​ కైవసం చేసుకున్నాడు మోమోటా. అనంతరం టోర్నీ వేదిక నుంచి ఆ దేశ రాజధాని పుత్రజయకు వెళ్తుండగా.. ఈ ఆటగాడు ప్రయాణిస్తున్న చిన్న వ్యాన్​ ఓ ట్రక్​ను ఢీకొంది. ఫలితంగా వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఇందులో ఈ జపాన్​ షట్లర్​తో పాటు అతడి కోచ్​, వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు. అందరూ చిన్న చిన్న గాయాలతో బయటపడగా.. వ్యాన్​ డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.

మోమోటా సహా మిగిలిన ఆటగాళ్లను దగ్గరలోని పుత్రజయ హాస్పిటల్​కు వైద్య సేవల కోసం తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మలేషియా బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ క్రీడాకారులకు గాయాలవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

బీడబ్ల్యూఎఫ్​ ఈ ఏడాది తొలి టోర్నీని మలేషియా వేదికగా నిర్వహించింది. ఇటీవల భారత స్టార్​ షట్లర్లు సైనా, సింధు సహా మన దేశానికి చెందిన దాదాపు 10 మంది ప్రపంచ స్థాయి షట్లర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details