తెలంగాణ

telangana

ETV Bharat / sports

సైనా రెండో రౌండ్​కు.. శ్రీకాంత్ ఇంటికి - సైనా రెండో రౌండుకు.. శ్రీకాంత్ ఇంటికి

కౌలాలంపుర్​లో జరుగుతున్న 'మలేసియా మాస్టర్స్​ సూపర్ 500' టోర్నీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్.. బెల్జియం ప్లేయర్​పై నెగ్గి రెండో రౌండ్​కు చేరింది. మరో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్.. చైనీస్ తైపీ ఆటగాడు చో టైన్ చేతిలో ఓడిపోయాడు.

Malaysia Masters: Saina cruises to 2nd round; Sai Praneeth, Srikanth bow out
సైనా రెండో రౌండుకు.. శ్రీకాంత్ ఇంటికి

By

Published : Jan 8, 2020, 2:31 PM IST

'మలేసియా మాస్టర్స్'​లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్​కు చేరుకుంది. కౌలాలంపుర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్​లో బెల్జియం ప్లేయర్ లియానే ట్యాన్​పై గెలిచింది. వీరిద్దరూ తలపడటం ఇదే మొదటిసారి.

మహిళల సింగిల్స్ విభాగంలో ట్యాన్​పై 21-15, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది సైనా. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించింది. తొలి సెట్లో అలవోకగా నెగ్గిన సైనా.. రెండో సెట్లో కొంచెం శ్రమించింది. అయినప్పటికీ చివరికి మ్యాచ్​ను సొంతం చేసుకుంది.

పురషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్.. తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టాడు. చైనీస్ తైపికి చెందిన చో టైన్ చెన్ చేతిలో 17-21, 5-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలిగేమ్​లో ప్రతిఘటించిన శ్రీకాంత్... రెండో సెట్లో చేతులెత్తేశాడు. ఫలితంగా మ్యాచ్​ను 30 నిమిషాల్లోనే ముగించాడు ప్రత్యర్థి.

ఇదీ చదవండి: 'డబ్ల్యూడబ్ల్యూఈ'లో ఫిక్సింగ్ ఉంది: ద గ్రేట్ ఖలీ

ABOUT THE AUTHOR

...view details