తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్ వాయిదా మంచి నిర్ణయం: సింధు

ఒలింపిక్స్ వాయిదా నిర్ణయాన్ని స్వాగతించింది భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. కరోనా ప్రభావంతో ప్రజలు చనిపోతుంటే టోర్నీ నిర్వహించడం సరికాదని అభిప్రాయపడింది.

సింధు
సింధు

By

Published : Mar 28, 2020, 3:26 PM IST

కరోనా ప్రభావం కారణంగా పలు టోర్నీలు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఒలింపిక్స్ కూడా ఏడాది పాటు వాయిదా పడింది. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందించారు. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశ్వక్రీడలు పోస్ట్ పోన్ కావడంపై సంతోషం వ్యక్తం చేసింది.

"ఇది (ఒలింపిక్స్ వాయిదా) ఒక మంచి నిర్ణయం. ఇంతకు మించి మనకు మరో అవకాశం లేదు. ఒకవైపు ప్రజలు చనిపోతున్నారు. జీవితమే ముందు. మిగతావన్నీ తర్వాత. టోర్నీని వాయిదా వేయడం మంచిదే."

-పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

ప్రస్తుతం సింధు స్వీయ నిర్బంధంలో ఉంది. ఇంగ్లాండ్ ఓపెన్ కోసం బర్మింగ్​హామ్ వెళ్లిన సింధు.. టోర్నీ రద్దవడం వల్ల స్వదేశానికి తిరిగొచ్చింది. ఈ కారణంగా ఇంట్లోనే క్వారంటైన్​లో ఉంది.

ABOUT THE AUTHOR

...view details