తెలంగాణ

telangana

ETV Bharat / sports

డెన్మార్క్​ ఓపెన్​: ప్రీ క్వార్టర్స్​కు లక్ష్య సేన్​ - లక్ష్యసేన్​

డెన్మార్క్​ ఓపెన్​ సూపర్ 750 టోర్నీలో భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్​ శుభారంభం చేశాడు. కరోనా తర్వాత ప్రారంభమైన తొలి బ్యాడ్మింటన్ టోర్నీలో అతడు ప్రీక్వార్టర్స్​కు దూసుకెళ్లాడు.

Lakshya Sen enters second round of Denmark Open
లక్ష్యసేన్

By

Published : Oct 14, 2020, 1:56 PM IST

Updated : Oct 14, 2020, 3:41 PM IST

భారత యువ బ్యాడ్మింటన్‌ ఆటగాడు లక్ష్యసేన్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో శుభారంభం చేశాడు. కరోనా మహమ్మారి కారణంగా ఏడు నెలల విరామం తర్వాత జరుగుతున్న తొలి బ్యాడ్మింటన్‌ టోర్నీలో అతడు ప్రీక్వార్టర్ ‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్య సేన్‌ 21-9, 21-15తో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. 36 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో వరుస సెట్లలో అతడు ప్రత్యర్థిని చిత్తుచేశాడు.

Last Updated : Oct 14, 2020, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details