జర్మనీలో మంగళవారం నుంచి 'సార్లార్లక్స్ ఓపెన్100 ' బాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టైటిల్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్యసేన్ గురిపెట్టాడు.
'సార్లార్లక్స్ ఓపెన్' టైటిల్‌పై లక్ష్యసేన్ గురి - germany badminton tornwy
డెన్మార్క్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన లక్ష్యసేన్ 'సార్లార్లక్స్ ఓపెన్100' బాడ్మింటన్ టోర్నీపై గురి పెట్టాడు. జర్మనీలో మంగళవారం నుంచి పారంభం కానున్న ఈ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవాలని భావిస్తున్నాడు.
సార్లార్లక్స్ ఓపెన్' టైటిల్‌పై లక్ష్యసేన్ గురి
ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్యసేన్‌కు బై లభించింది. హొవార్డ్ షు (అమెరికా) లేదా ఫాబియో కాపోనియో (ఇటలీ)తో రెండో రౌండ్లో లక్ష్యసేన్ పోటీపడతాడు. తొలి రౌండ్లో మాగ్జిమ్ మొరీల్స్ (బెల్జియం)తో అజయ్ జయరాం తలపడనుండగా శుభంకర్‌కు బై దొరికింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్రిస్టిన్ కూబా (ఈస్తోనియా)తో మాళివిక పోటీపడుతుంది.