తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొరియా ఓపెన్​: బరిలోకి సైనా, సింధు,ప్రణీత్​ - కొరియా ఓపెన్ 2019

భారత షట్లర్లు మరో అంతర్జాతీయ టోర్నీకి సిద్ధమయ్యారు. నేటి నుంచి ప్రారంభమయ్యే కొరియా ఓపెన్​ సూపర్​-500 టోర్నీలో ముగ్గురు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్​లో సింధు, సైనా, పురుషుల సింగిల్స్​లో సాయి ప్రణీత్​ రేసులో ఉన్నారు.

korea open 2019: sina, sindhu, praneeth favorites in the race

By

Published : Sep 24, 2019, 9:25 AM IST

Updated : Oct 1, 2019, 7:15 PM IST

బ్యాడ్మింటన్​లో మరో అంతర్జాతీయ టోర్నీ కొరియా ఓపెన్​ నేటి నుంచి మొదలుకాబోతోంది. ఇందులో మహిళల సింగిల్స్​లో సింధు, సైనా, పురుషుల సింగిల్స్​లో సాయిప్రణీత్​, కశ్యప్​ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు.

టైటిల్​ వేటలో సింధు...

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణం తర్వాత చైనా ఓపెన్‌లో పోటీపడిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు... రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆ ఓటమికి కొరియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్లో బదులుతీర్చుకోవాలని చూస్తోంది. మంగళవారం ఆరంభమయ్యే ఈ టోర్నీలో అయిదో సీడ్‌ సింధు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

  • 2017లో కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించింది సింధు. తొలి రౌండ్లో ఆమె అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ను ఢీ కొనబోతోంది. చైనా ఓపెన్‌లో తనను ఓడించిన థాయ్‌లాండ్‌ షట్లర్‌ చోచువాంగ్‌ ఆమెకు రెండో రెండ్లో ఎదురుపడే అవకాశముంది.
  • ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న మరో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌.. తొలి రౌండ్లో కిమ్‌ గా యున్‌(కొరియా)తో తలపడనుంది.
  • పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ టోర్నీకి దూరం కాగా.. సాయిప్రణీత్‌కు తొలి రౌండ్లో కఠిన సవాల్‌ ఎదురు కానుంది. అతను అయిదో సీడ్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)ను ఢీ కొనబోతున్నాడు.
  • 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల ఛాంపియన్​ పారుపల్లి కశ్యప్‌ క్వాలిఫయర్‌తో తొలి రౌండ్‌ ఆడనున్నాడు.

క్వాలిఫయింగ్​ పోటీలతో పాటు డబుల్స్​ విభాగాల మ్యాచ్​లు ఈరోజు నుంచే ప్రారంభంకానున్నాయి. మెయిన్​ డ్రా సింగిల్స్​ మాత్రం బుధవారం మొదలవుతాయి.

Last Updated : Oct 1, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details