మంగళవారం నుంచి కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ 300 టోర్నీ ప్రారంభంకానుంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి తప్పుకోగా.. టైటిల్ నెగ్గాలనే పట్టుదలతోకిదాంబి శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడు.
ఈ ఏడాది.. ఇండియా ఓపెన్ గెలిచి జోరుమీద కనిపించాడు భారత స్టార్షట్లర్ శ్రీకాంత్. ఆ తర్వాత ఆశించిన రీతిలో రాణించలేదు. గాయాల కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమయ్యాడు. హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో సెమీస్ చేరుకుని తిరిగి ఫామ్ అందుకున్నాడు. కొరియా ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో తలపడనున్నాడు. ఇప్పటివరకు వీరు తలపడిన మ్యాచ్ల్లో 10-3 తేడాతో శ్రీకాంత్దే పైచేయి.