తెలంగాణ

telangana

ETV Bharat / sports

డెన్మార్క్ ఓపెన్​లో ఆరో సీడ్‌గా శ్రీకాంత్‌ - డెన్మార్క్ ఓపెన్

ఈ నెల 13 నుంచి డెన్మార్క్ ఓపెన్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత షట్లర్ శ్రీకాంత్ ఆరో సీడ్​గా బరిలో దిగబోతున్నాడు.

Kidambi Srikanth seeded sixth at Denmark Open
డెన్మార్క్ ఓపెన్​లో ఆరో సీడ్‌గా శ్రీకాంత్‌

By

Published : Sep 27, 2020, 7:23 AM IST

కరోనా వల్ల లభించిన విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు డెన్మార్క్ ఓపెన్​ను పునఃప్రారంభంగా భావిస్తున్నారు. ఈ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌గా బరిలో దిగనున్నాడు. వచ్చే నెల 13న ఆరంభమయ్యే ఈ టోర్నీ సీడింగ్‌లను శనివారం ప్రకటించారు.

కెంటో మొమొటా, టియాన్‌ చెన్‌, ఆంటోన్సెన్‌, లాంగ్‌, సునేయమా వరుసగా తొలి అయిదు సీడింగ్స్‌ దక్కించుకున్నారు. భారత్‌ నుంచి శ్రీకాంత్‌తో పాటు కశ్యప్‌, లక్ష్యసేన్‌, శుభంకర్‌, జయరాం ఈ టోర్నీలో పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ ఆడనుంది. పీవీ సింధు టోర్నీ నుంచి తప్పుకుంది. యమగూచి, ఒకుహర, మారిన్‌లకు వరుసగా తొలి మూడు సీడింగ్స్‌ కేటాయించారు.

సైనా నెహ్వాల్

ABOUT THE AUTHOR

...view details