కీలక టోర్నీల్లో భారత షట్లర్ల వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా కొరియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. రెండో రౌండ్లో జపాన్‌కు చెంది కాంటా సునెయామ చేతిలో పరాజయం పాలయ్యాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలో 14-21, 19-21 తేడాతో వరుస సెట్లలో ఓడాడు శ్రీకాంత్. తొలి సెట్లో పెద్దగా ప్రభావం చూపని ఈ తెలుగుతేజం.. రెండో గేములో కాస్త పోరాడాడు. అయితే ప్రత్యర్థి వ్యూహాలముందు తేలిపోయాడు. ఫలితంగా మ్యాచ్ చేజార్చుకున్నాడు.