ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచివరల్డ్ నంబర్‌వన్, జపాన్ షట్లర్ కెంటో మొమోటాఅరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఏడాది 11 టైటిల్స్ గెలిచిన తొలి షట్లర్‌గా రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన సింగిల్స్ తుదిపోరులో ఇండోనేషియా ప్లేయర్ ఆంథోనీని ఓడించి ఈ ఘనత సాధించాడు.
87 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 17-21, 21-17, 21-14 తేడాతో ప్రత్యర్థిని ఓడించాడు. తొలి గేమ్‌లో ఓడినా తర్వాత పుంజుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండు సెట్లలోనూ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
గతంలో ఒకే ఏడాది అత్యధిక టైటిల్స్ గెలిచిన రికార్డు లీచోంగ్ వి (మలేసియా), వాంగ్ జియోలి-యు యాంగ్ (చైనా) జంట పేరిట ఉండేది. 2010లో లీచోంగ్ సింగిల్స్ విభాగంలో 10 టైటిల్స్ గెలవగా, 2011లో వాంగ్ జియోలి- యు యాంగ్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో 10 టైటిల్స్ సాధించింది.
ఈ ఏడాది కెంటో చైనా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, జపాన్ ఓపెన్, ఆసియా ఛాంపియన్‌షిప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు.
ఇదీ చదవండి: గాయపడిన విద్యార్థులను పట్టించుకోండి: ఇర్ఫాన్